బాబు మోసపూరిత పాలనపై ఉద్యమం
సాక్షి ప్రతినిధి, కడప: సీఎం చంద్రబాబు మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైందని కమలాపురం ఎమ్మెల్యేపోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఆయన ఆదివారం వీరపునాయునిపల్లెలో నిరవధిక నిరహారదీక్ష చేపట్టారు. ఈ శిబిరంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ,వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబులు మాట్లాడారు.