తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భక్తులు ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. భక్తులకు పూర్తిగా సేవలు అందించలేక పోయమని ఆయన బాధపడ్డారు. జనవరి నుంచి టీటీడీ సత్రాల్లో భక్తుల సౌకర్యార్ధం ఉచిత భోజన వసతి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యతను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రసాదాల తయారి దిట్టంలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. నడకదారి భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూ పథకం కొనసాగింపు గురించి పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బాపిరాజు చెప్పారు.
జనవరి నుంచి టిటిడి సత్రాలలో ఉచిత భోజనం
Published Sun, Oct 13 2013 8:20 PM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
Advertisement
Advertisement