చిరు, బొత్సలకు చేదు అనుభవం | gail victims angry on Chiranjeevi, Botsa satya narayana | Sakshi
Sakshi News home page

చిరు, బొత్సలకు చేదు అనుభవం

Published Sun, Jun 29 2014 3:02 PM | Last Updated on Fri, Jul 12 2019 3:10 PM

చిరు, బొత్సలకు చేదు అనుభవం - Sakshi

చిరు, బొత్సలకు చేదు అనుభవం

కాకినాడ: కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు తూర్పుగోదావరి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడు  బాధితులను పరామర్శించేందుకు ఆదివారం చిరంజీవి, బొత్స నగరం వెళ్లారు.

పేలుడు జరిగిన సంఘటనా స్థలాన్ని వీరిద్దరూ పరిశీలించారు. బాధితులను పరామర్శించే సమయంలో చిరంజీవి, బొత్సలను నగరం ప్రజలు అడ్డుకున్నారు. చిరంజీవి, బొత్సలకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. తమకు మీ పరామర్శలు అవసరం లేదంటూ నిరసన తెలిపారు. చిరంజీవి, బొత్స తదితరులు అక్కడ నుంచి వెనుదిరిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement