
హైకోర్టులో గల్లా జయదేవ్ కు ఊరట
హైదరాబాద్:ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికకు సంబంధించి నెలకొన్న వివాదంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు స్వల్ప ఊరట లభించింది. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కు రెండుసార్లు ఎన్నికలు జరగడంతో ఆ వివాదం హైకోర్టుకు చేరింది. అంతకముందు ఏప్రిల్ 19వ తేదీనే జరిగిన ఎన్నికే సరైనదంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు సరైన ఎన్నిక ఎవరిదో తేల్చాలంటూ సింగిల్ బెంచ్ జడ్జికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికపై వివాదాన్ని జూన్ మొదటి వారంలో హైకోర్టు విచారించే అవకాశం ఉంది.
ఏపీ అసోసియేషన్ కు రెండు సార్లు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. తొలి ఎన్నికలో ఏపీ ఒలింపిక్ అసోసియన్ అధ్యక్షుడిగా గల్లా జయదేవ్ ఎన్నికైనట్లు తెలపగా, తరువాత జరిగిన ఎన్నికలో సీఎం రమేష్ అధ్యక్షుడిగా నియమితులైనట్లు ప్రకటించారు. దీంతో ఆ ఎన్నికపై వివాదం నెలకొంది.