
'చంద్రబాబు మాట్లాడిన తీరు అభ్యంతరకరం'
హైదరాబాద్: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మరణంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు అభ్యంతరకరమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. జీవితంలో అధికారం దక్కదనే అసహనంతో బాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకపార్టీకి అధ్యక్షుడిగా ఉండా చంద్రబాబు ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని గండ్ర తెలిపారు. బాబు తన వైఖరిని మార్చుకోకుంటే తెలంగాణలో అడుగుపెట్టలేరని గండ్ర హెచ్చరించారు. తెలంగాణ టీడీపీ నాయకులు బాబు నాయకత్వంపై పునరాలోచన చేయాలన్నారు.
పంజాబ్, శ్రీలంక సమస్యలను అప్పటి ఇందిరా గాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీలు సరిగా డీల్ చేయకనే ఉగ్రవాదానికి బలయ్యారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఖండించారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు.