నకిలీ చెక్కుల ముఠాకు చెక్ | Gang of fake checks, check | Sakshi
Sakshi News home page

నకిలీ చెక్కుల ముఠాకు చెక్

Published Tue, Aug 5 2014 12:46 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM

Gang of fake checks, check

నర్సీపట్నం టౌన్: నకిలీ చెక్కులతో బ్యాంకు అధికారులను బురిడీ కొట్టించి దాదాపు అర కోటి రూపాయలను కైంకర్యం చేసిన కేసులో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ముగ్గురికి యలమంచిలి కోర్టు రిమాండు విధించింది. దీంతో వారిని సోమవారం విశాఖపట్నంలోని సెంట్ర ల్ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి...

అస్సాంలోని దిబ్రుగఢ్ యూనివర్సిటీ పేరుతో సుమారు రూ. 9.86 లక్షలకు, విజయవాడ జేకే టైర్స్ పేరుతో రూ. 39.86 లక్షలకు సృష్టించిన నకిలీ చెక్కులను ఉప్పు కేశవరావు, సోమల నాగేంద్ర 2013, ఏప్రిల్ 29న నర్సీపట్నంలోని ఒక బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ మొత్తాన్ని డ్రా చేశారు. అయితే అవి నకిలీవని తేలడంతో సంబంధిత బ్యాం కు మేనేజరు ఫిర్యాదు మేరకు పోలీసు లు ఈ కేసును దర్యాప్తు చేశారు. నింది తులైన కేశవరావు, నాగేంద్రలను గత ఏడాది మే 23న అరెస్టు చేశారు.

ఈ వ్య వహారం వెనుక అంతర్రాష్ట్ర ముఠా హ స్తం ఉందని తేలడంతో ఆ దిశగా దర్యా ప్తు చేశారు. బీహార్‌లోని పాట్నాకు చెంది న సన్ని ప్రియదర్శి, విశ్వవిజేత సిన్హా, అభయకుమార్ సిన్హా, ఉత్తమకుమార్ సాహులపై కేసు నమోదు చేశారు. అ యితే అప్పటికే వారు ఇదే నకిలీ చెక్కు ల వ్యవహారంలో బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు మరో మూ డు రాష్ట్రాల్లోనూ వారిపై ఇదే తరహా కేసులు ఉన్నాయి.

పాట్నా సెంట్రల్ జై లులో ఉన్న ప్రియదర్శి, విశ్వవిజేత సి న్హా, అభయకుమార్ సిన్హాలను నర్సీపట్నం కోర్టులో హాజరుపరిచేందుకు బీ హార్ పోలీసులు సోమవారం తీసుకొచ్చారు. నర్సీపట్నం కోర్టు జడ్జి సెలవు లో ఉండడంతో యలమంచిలి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో వారిని పోలీసులు విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో వీరిని నర్సీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement