
ఆందోళనకారులకు మంత్రి గంటా వార్నింగ్
విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ నిర్వహించే ర్యాలీలను అనుమతించేది లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ తమ నిర్ణయాలు మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రత్యేక హోదా ఆందోళనలు జరిపినా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉద్యమాన్ని ఆరంభంలోనే అణిచివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో వైజాగ్ లో పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు.
ప్రత్యేక హోదా పోరాటం నేపథ్యంలో విశాఖలో భారీగా పోలీసులను మోహరించారు. ప్రధాన జంక్షన్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. నగరంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్న యువతను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. బీచ్ రోడ్డులోకి ఎవరూ వెళ్లకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై విశాఖ వాసులు మండిపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు వచ్చినా ఇంత సెక్యురిటీ ఉండదేమోనని వ్యాఖ్యానించారు.