'విభజన బిల్లును తగలబెట్టడంలో తప్పు లేదు' | Ganta Srinivasarao supports set Bifurcation Bill | Sakshi
Sakshi News home page

'విభజన బిల్లును తగలబెట్టడంలో తప్పు లేదు'

Published Tue, Jan 14 2014 11:46 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

'విభజన బిల్లును తగలబెట్టడంలో తప్పు లేదు' - Sakshi

'విభజన బిల్లును తగలబెట్టడంలో తప్పు లేదు'

విశాఖపట్టణం: ప్రజలు వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముసాయిదా బిల్లును భోగి మంటల్లో తగలబెట్టడంలో తప్పు లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర రాజధానిలోని ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను ధ్వంసం చేస్తే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ నాయకుడు స్పందించలేదన్నారు. విభజన బిల్లు ప్రతులను దగ్ధం చేస్తే తెలంగాణ నేతలకు ఎందుకు కోపం వచ్చిందని ఆయన ప్రశ్నించారు.

విభజనను నిరసిస్తూ విశాఖ కలెక్టరేట్ వద్ద భోగిమంటల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను సమైక్య జేఏసీ నాయకులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకట్రామయ్య, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకర్ల రమష్‌బాబు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement