తెలంగాణకే గౌరవ్ ఉప్పల్!
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినట్టు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఐఎఎస్ అధికారుల విభజనను పూర్తిచేసింది. ఉప్పల్ మొదటి నుంచి తెలంగాణకు వెళ్లాలనే ఆప్షన్ ఇచ్చారు.తొలి కేటాయింపుల్లో కూడా ఆయన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకే కేటాయించింది. దీనిపై అపీళ్లు కూడా కొరింది. ముందునుంచీ ఆయన తెలంగాణాకు వెళ్లేందుకే సుముఖంగా ఉండడంతో ఆయన ఎటువంటి అపీల్‌ను పెట్టుకొలేదు. ప్రత్యుష్ సిన్హా కమిటీ సిపార్సుల మేరకు ఈసారి కేటాయింపుల్లో కూడా ఉప్పల్‌ను తెలంగాణాకే కేటాయించినట్టు సమాచారం. అయితే ఇంతవరకు కలెక్టరేట్‌కు ఎటువంటి సమాచారం రాలేదు.