జగనన్నకు ఎల్లవేళలా భగవంతుడి ఆశీస్సులు | God's blessings always | Sakshi
Sakshi News home page

జగనన్నకు ఎల్లవేళలా భగవంతుడి ఆశీస్సులు

Published Mon, Dec 22 2014 2:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

జగనన్నకు ఎల్లవేళలా భగవంతుడి ఆశీస్సులు - Sakshi

జగనన్నకు ఎల్లవేళలా భగవంతుడి ఆశీస్సులు

ఎమ్మెల్యే అనిల్:  నెల్లూరు (సెంట్రల్):  ప్రజల కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని  నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆకాక్షించారు. జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరిం చుకుని వైఎస్సార్‌సీపీ సిటీ కార్యాలయం సమీపంలోని ఎంసీఎస్ క ల్యాణ మండపంలో డిప్యూటీ మే యర్ ముక్కాల ద్వారకానాథ్ ఆ ధ్వర్యంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ము ఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే అ నిల్ అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
 
 అనిల్‌కుమార్ మాట్లాడుతూ జగనన్నకు నగర ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. సుఖసంతోషాలతో ఉండటంతో పాటు వైఎస్సార్‌సీపీని ముందుకు తీసుకెళ్లేందుకు మరింత శక్తి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. జగనన్నపై దుష్ట ప్రయత్నాలు చేస్తున్న వారి నుంచి కా పాడి నిండు నూరేళ్లు ప్రజలతో ఉండేలా దీవించాలని కోరారు. రాజకీయంగా అవకాశం ఇచ్చి త మను ఎమ్మెల్యేలను చేసిన జగన న్న వెంటే తాము ఉంటామని ఆయన స్పష్టం చేశారు. డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్ మాట్లాడు తూ జగనన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఈ సీజన్‌లో రక్తం అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. వందలాది మంది తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.
 
  వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యం లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేష న్ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, నాయకులు మునీర్‌సిద్దిక్, టి రఘురామిరెడ్డి, సిద్దు రమణారెడ్డి, ము దిరెడ్డి లక్ష్మిరెడ్డి, సింగంశెట్టి అశోక్, సగిలి జయరామిరెడ్డి, కా కుటూరు విజయభాస్కర్‌రెడ్డి, వే నాటి శ్రీకాంత్‌రెడ్డి, మాగుంట శ్రీ కాంత్‌రెడ్డి, జిజె సత్యానందం, అర వ ఆనంద్‌బాబు, ఎ.బాలా ప్రసా ద్, పోలిపల్లి మోహన్, ఊటుకూ రు నాగేశ్వరరావు, బి.హరిప్రసాద్‌నాయుడు, బవి సత్యకృష్ణ, పి.అ ఖిల్, కాకు హరికృష్ణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement