వైఎస్సార్ జిల్లా: గుర్తుతెలియని దుండగులు ఒక ఇంట్లో చొరబడి పెద్ద మొత్తంలో డబ్బు, నగదుతో ఉడాయించారు. ఈ సంఘటన ఆదివారం వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని కామిశెట్టినగర్‌లో జరిగింది. వివరాలు..పట్టణానికి చెందిన అక్కిరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబసభ్యులు వేసవి కావడంతో రాత్రిపూట ఇంటిపై నిద్రపోతున్నారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటిలో చోరబడి రూ.1.80 లక్షల నగదు, 13 తులాల బంగారం దోచుకున్నారు.
తెల్లవారిన తర్వాత వచ్చి చూసిన కుటుంబసభ్యులు దొంగతనం జరిగిందని తెలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వేకోడూరులో చోరీ
Published Sun, Apr 19 2015 11:52 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM
Advertisement
Advertisement