అనంతపురం: వ్యవసాయం కోసం రైతులు బ్యాంక్ లో తాకట్టుపెట్టిన బంగారు నగల వేలాన్ని సీపీఐ నాయకులు అడ్డుకున్నారు. రాప్తాడు మండలంలోని కెనరా బ్యాంకు వద్ద చోటు చేసుకుంది. కెనరా బ్యాంకు మేనేజర్ మరో 10 రోజులు గడువు ఇవ్వడంతో సీపీఐ నాయకులు ఆందోళన విరమించారు.
సుమారు 200 మంది రైతులు వ్యవసాయంలో పెట్టుబడి కోసం బంగారు ఆభరణాలను కెనరా బ్యాంకు లో తాకట్టుపెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రుణాలు చెల్లించలేదు. టీడీపీ రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీ పెరిగి చెల్లించలేని పరిస్థితికి వచ్చింది. దీంతో నగల వేలానికి బ్యాంకు అధికారులు ప్రయత్నించగా సీపీఐ నాయకులు అడ్డుకున్నారు.