సాక్షి, కర్నూలు: జిల్లాలో ఏ మండలంలో చూసినా ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని రెవెన్యూ సిబ్బంది సాయంతో కొందరు కబ్జాదారులు సొంతం చేసుకుంటున్నారు. ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వం ఓ ప్రయత్నం చేస్తోంది. సర్కారు భూముల వివరాలను సేకరించి కంప్యూటరులో నిక్షిప్తం చేస్తున్నారు. త్వరలో ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు.. కొత్త పరిశ్రమలు.. సంస్థల ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రక్రియ ప్రాధాన్యం సంతరించుకుంది. రెవెన్యూ సిబ్బంది ఇందులో తలమునకలయ్యారు.
భూముల నిక్షిప్తం ఇలా...: ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, మేతపోరంబోకు, శ్మశాన స్థలాలు, డొంకలు, వసతిగృహాలు, పాఠశాల స్థలాలు తదితర భూముల ప్రస్తుత పరిస్థితి.. అవి ఏ రూపంలో ఉన్నాయి.. బల్క్ డిజిటల్ సైనింగ్ పద్ధతి ద్వారా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేస్తున్నారు.
వీటిని సర్కారు భూమి పేరుతో ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. దాంతో ఎక్కడి నుంచైనా ఆ వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి ప్రభుత్వానిదో.. కాదో తాజా పరిస్థితిని సులువుగా తెలుసుకోవచ్చు. ఈ విధానం ద్వారా కబ్జాదారుల ఆటలు కొంతవరకు అరికట్టవచ్చు. ప్రభుత్వ భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తే.. రెవెన్యూ అధికారులతో సంబంధం లేకుండా భూముల స్థితి, స్వభావం తదితర వివరాలనునెట్‌లోచూసి తెలుసుకునే వీలుంది. దీంతోపాటు రెవెన్యూ కార్యాలయంలో అధికారులపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. అధికారుల సైతం ప్రభుత్వ భూములను భిన్నాలుగా మార్చి పట్టాలిచ్చే విధానానికి అడ్డుకట్టపడే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో సర్కారు భూములు
Published Sun, Jul 27 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 10:55 AM
Advertisement
Advertisement