అనంతపురం టౌన్, న్యూస్‌లైన్: ఉగ్రవాదుల అణచివేతలో ప్రభుత్వం విఫలమైందని, నరేంద్ర మోడీ బహిరంగ సభ సందర్భంగా పాట్నాలో చోటుచేసుకున్న బాంబు పేలుళ్లే అందుకు నిదర్శనమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్ రెడ్డి ఆరోపించారు. పాట్నా బాంబు పేలుళ్లకు నిరసనగా ఆదివారం నగరంలోని సప్తగిరి సర్కిల్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాంబు పేలుళ్లు పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఈ సంఘటనలతో ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయన్నారు.
రాబోవు ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని, అప్పుడు ఉగ్రవాదులు, విచ్ఛిన్నకర శక్తులు తోకముడవక తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జగన్మోహన్, వెంకటనాయుడు, చంద్రశేఖర్, సుధాకర్‌రెడ్డి, తరుణ్‌రెడ్డి, మహిళామోర్చా నాయకురాళ్లు మల్లీశ్వరి, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రవాదుల అణచివేతలో ప్రభుత్వం విఫలం
Published Mon, Oct 28 2013 3:01 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement