'హాస్టల్స్ను రెసిడెన్షియల్స్గా మార్చుతాం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతి గృహాలను రెసిడెన్షియల్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. ఈ మేరకు వార్షిక బడ్జెట్ లో ఏటా రూ. 1000 నుంచి రూ. 1200 కోట్లు కేటాయిస్తామన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం, గుంటూరు జిల్లా పత్తిపాడు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంతోపాటు మరో చోట హాస్టళ్ల స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయినట్లు వివరించారు. ఆదివారం విజయవాడలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, జేడీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల రాష్ట్ర స్థాయి వర్క్షాపులో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో రూ. 25 కోట్లతో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.