సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన జీఎస్‌ఎల్‌వీ డీ5 రాకెట్‌ను 2014, జనవరి 5న ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 19నే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా రాకెట్ రెండోదశలో ఇంధనం లీకేజీ కావడంతో వాయిదా వేసిన విషయం తెలిసిందే.