అనంతపురం జిల్లా ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీలో చేనేత కార్మికుడు రామాంజనేయులు(28) శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అనంతపురం (ధర్మవరం): అనంతపురం జిల్లా ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీలో చేనేత కార్మికుడు రామాంజనేయులు(28) శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామాంజనేయులు ఇంట్లోనే మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి భార్య భాను, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అయితే అప్పులబాధ ఎక్కువ కావడంతోపాటు కుటుంబంలో చిన్నపాటి సమస్యలతో మనస్తాపం చెందిన రామాంజనేయులు ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.