- త్వరలోనే కష్టాలన్నీ తీరుతాయి
- వైఎస్సార్ సీపీలోకి టీడీపీ నాయకులు
- సాయినగర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభం
తిరుచానూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అధికారంలోకి రానున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరుతాయని ఆ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ సాయినగర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ డీవీ.రమణ నూతనంగా ఏర్పాటుచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న పాలనలో ప్రజలందరూ సుఖం గా జీవించారని, ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుల పాలన మరోమారు తొమ్మిదేళ్ల టీడీపీ చీకటి పాలనను గుర్తుకు తెచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ ప్రజలను మోసం చేశాయన్నా రు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రెండు పార్టీల నాయకులు ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు.
ఆరేళ్ల వైఎస్సార్ పాలనలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌గా వెలిగిందని కొనియాడారు. తిరిగి రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని జగ నన్న స్థాపించనున్నారని, త్వరలోనే మనందరి కష్టాలు తీరుతాయని హామీ ఇచ్చారు. విశ్వసనీయతకు మారుపేరైన జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి మనమందరం సీలింగ్ ఫ్యాను గుర్తుకు ఓటేద్దామని పిలుపునిచ్చారు.
అలాగే సాయినగర్ 1, 2, 3వ సెగ్మెంట్ల ఎంపీటీసీ అభ్యర్థులు టి.బుజ్జమ్మ, పద్మావతి, డీవీ.రమణ, జెడ్పీటీసీ అభ్యర్థి తలారి ఆనందమ్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. డీవీ.రమణ మాట్లాడు తూ ప్రజల సమస్యలపై సత్వరమే స్పందించే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని తుమ్మల గుంట తరహాలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుం దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చెవిరెడ్డి హనుమంతరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, చెన్నారెడ్డి, శ్రీరాములురెడ్డి, లక్ష్మయ్య, చిన్నబ్బ, సుధాకర్‌రెడ్డి, నారాయణ, బాలాజీ, సత్య పాల్గొన్నారు.
పార్టీలో చేరిన టీడీపీ నాయకులు
స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం భారీ ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీవీ.రమణ ఆధ్వర్యంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో గ్రామ ఉపసర్పంచ్ ఉషారాణి, సావిత్రమ్మ, జగ్గయ్య, మంజులమ్మ, మునికృష్ణ, గాజుల భాస్కర్, నరసింహులు, కన్నయ్య, పెంచలయ్య, జీ.వెంకటేష్, షణ్ముగంఆచారి, కృష్ణమాచారితో పాటు దాదాపు 300మంది పార్టీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపునకు తామందరం కృషి చేస్తామని వారు చెప్పారు.