సీఎంకు సాదర స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గురువారం స్థానిక విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది. విజయవాడలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 8.30 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయ లాంజ్ రూమ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ వెళ్లారు.
విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, జిల్లా మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీమోహన్, కాగిత వెంకట్రావ్, బొండా ఉమామహేశ్వరరావు, బోడే ప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, కేఎస్ లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ జె.మురళీ, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి వెంకట బాలవర్దనరావు, ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు స్వాగతం పలికారు.
పూర్తిగా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి
విమానాశ్రయం బయటకు వచ్చిన ముఖ్యమంత్రికి టీడీపీ నాయకులు ప్రత్యేకంగా తీసుకువచ్చిన రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలతో సన్మానం చేయించారు. సీఎంకు పుష్పగుచ్చాలు అందజేసిన పలువురు మహిళలు అభినందనలు తెలిపారు. ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం మేరకు రుణాలను పూర్తిగా మాఫీ చేసి తమను అదుకోవాలని పలువురు మహిళలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు.