సీఎంకు సాదర స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం) : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం స్థానిక విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు సాదర స్వాగతం పలికారు. గుంటూరులో జరిగే టీచర్స్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చారు.
విమానాశ్రయంలో సీఎంకు మంత్రులు రావెల కిషోర్‌బాబు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, వైస్ చైర్మన్ రమణ, జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళీ, విజయవాడ సీపీ ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, టీడీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం రోడ్డు మార్గంలో సీఎం గుంటూరు బయలుదేరి వెళ్లారు. గుంటూరులో కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.