సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని పలుప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి భారీగా వర్షం కురుస్తోంది. కొండాపురం, జలదంకి, కావలిలో వర్షం పడుతోంది. దీంతో రహదారులన్నీ పూర్తిగా జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ట్రాన్స్‌కో అధికారులు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కోవాల్సి వస్తోంది.
ఇదిలా ఉండగా... ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.