
పుష్కరాలకు హాజరైనవారి సంఖ్య 4 కోట్ల 70 లక్షలు
రాజమండ్రి : ఉభయగోదావరి జిల్లాల్లో శనివారం మధ్యాహ్నం వరకు పుష్కరాలకు హాజరైనవారి సంఖ్య 4 కోట్ల 70 లక్షలకు చేరింది. గోదావరి పుష్కరాలకు చివరి రోజు కావడం, అందులోనూ శెలవు రోజు కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో గోదావరి జిల్లాల్లోని పుష్కరఘాట్‌లకు భక్తుల తాకిడి ఎక్కువైంది.