మహా పుష్కరాల సందర్భంగా గోదావరిలో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు.
రాజమండ్రి (తూర్పు గోదావరి) : మహా పుష్కరాల సందర్భంగా గోదావరిలో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ట్రాఫిక్ కిలో మీటర్ల మేర నిలిచిపోయింది. అలాగే అన్నవరం, అంతర్వేది పుణ్యక్షేత్రల్లో భక్తులు బారులు తీరారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని స్నాన ఘట్టాలు యాత్రికులతో కిటకిటలాడుతున్నాయి. యానాం, కోనసీమల్లో కూడా భక్తులు స్నాన ఘాట్లలో పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ట్రాఫిక్ జాం అవ్వడటంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.