వీఆర్వో అభ్యర్థులకు బస్టాండ్‌లో హెల్ప్‌డెస్క్
Published Sun, Feb 2 2014 2:22 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ :గుంటూరు నగరంలో, గుంటూరు రూరల్ మండల పరిధిలో ఏర్పాటు చేసిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్ష కేంద్రాలలో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలని తహాశీల్దార్ తాతా మోహన్‌రావు అన్నారు. స్థానిక లాడ్జిసెంటర్, మార్కెట్, బస్టాండ్, బీఆర్ స్టేడియం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డె స్క్ కేంద్రాలను తహశీల్దార్ తాతా మోహన్‌రావు సిబ్బందితో పరిశీలించారు. హెల్ప్ డెస్క్ కేంద్రం వద్ద శనివార ం రాత్రి 8 గంటల నుంచే రెవెన్యూ సిబ్బందిని ఏర్పాటుచేసినట్టు ఆయన తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వీఆర్వో, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వీఆర్‌ఏ పరీక్షలు పూర్తయ్యేంతవరకు కూడా సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు.
దూరప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరీక్ష కేంద్రాల వివరాలను అభ్యర్థులకు క్షుణ్ణంగా వివరించాలని తెలిపారు. ప్రతి హెల్ప్ డెస్క్ కేంద్రం వద్ద వీఆర్వోలను ఏర్పాటుచేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద కూడా రెవెన్యూ సిబ్బంది ఆయా పాఠశాలలు, కళాశాలల సిబ్బంది అందుబాటులో ఉండడంతో పాటు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. పరీక్షలు పూర్తయ్యేంతవరకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే అని చెప్పారు. గుంటూరు నగరంలో 63, రూరల్‌లో 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఈ కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా, సమాచారం కోసం 0863-2234070, ఆర్డీవో రామమూర్తి 9849904006 ,తహశీల్దార్ తాతా మోహన్‌రావు 9849904016 లకు ఫోన్ చెయ్యాల్సిందిగా కోరారు.
పరీక్షా కేంద్రాలకు కేఎల్ వర్సిటీ ఉచిత బస్సులు
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: వడ్డేశ్వరం కె.ఎల్.యూనివర్సిటీలో వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలు హాజరయ్యే అభ్యర్థుల కోసం యూనివ ర్సిటీ యాజమాన్యం పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు శనివారం తెలిపారు. జాతీయ రహదారి వద్ద నుంచి బస్సులు కేఎల్ వర్సీటీ పరీక్షా కేంద్రానికి చేరవేస్తాయన్నారు. అలాగే నంబూరు వీవీఐటీ కళాశాల యాజమాన్యం కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Advertisement
Advertisement