
తల్లి కళ్లెదుటే విగతజీవులుగా మారిన పిల్లలు...
విజయనగరంలోని రంగాల వీధికి చెందిన కె.రేవతి(16), కె.రవి(19) సంక్రాంతికి తల్లి శారదతో కలసి భవానీపట్నం వెళ్లి తిరుగు ప్రయాణంలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. కూనేరు వద్దకు రైలు ప్రమాదానికి గురవ్వడంతో రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. రవి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. శారద చిన్నపాటి గాయాలతో బయటపడింది.
కాగా, శారద భర్త శ్రీనివాస్ ఏడాది క్రితమే మరణించాడు. ఇప్పుడు ప్రమాదంలో పిల్లలిద్దరూ తన కళ్లెదుటే విగతజీవులుగా మారడంతో ఆ తల్లి శోకసంద్రంలో మునిగింది.