విశాఖపట్నం: విజయనగరంలో జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్ల సమయాల్లో, వెళ్లే మార్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రైళ్లు మొత్తానికే రద్దుకాగా మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ధన్‌బాద్ అలెప్పీ ఎక్స్‌ప్రెస్, హతియ యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లను టిట్టాగఢ్-రాయ్‌పూర్-నాగ్‌పూర్ మీదుగా దారిమళ్లించగా.. నాందేడ్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను కుర్టా రోడ్డు-అంగుల్ మీదుగా దారి మళ్లించారు. ఇక రాయ్‌గఢ్-విశాఖ ప్యాసింజర్, విశాఖ-కోరాపుట్, సంబల్‌పూర్-నాందేడ్ రైళ్లు రద్దు చేశారు. మరోపక్క, కోరాపుట్-విశాఖ రైలును రాయగఢ్ వరకే పరిమితం చేశారు.
అయితే, ట్రాక్ పనులపై డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ వివరణ ఇచ్చారు. సాయంత్రానికి ట్రాక్ పనులు పునరుద్ధరిస్తామని చెప్పారు. రైలు ప్రమాదంపై సాక్షి టీవీతో మాట్లాడిన ఆయన రైలు ప్రమాదం విచారణ కమిటీ వేసినట్లు వివరించారు. ప్రమాదంపై ఇంకా ప్రాథమిక నిర్ధారణకు రాలేదని ఆయన అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దీనితో ఇంజన్ సహా పలు బోగీలు బోల్తా పడ్డాయి. నాలుగు బోగీలు పక్క ట్రాక్‌పైనే వెళ్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 35 మందికిపైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.