అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కల్లూరు గ్రామం వద్ద సోమవారం పులివెందుల బ్రాంచి కెనాల్(పీబీసీ) కు గండి కొట్టిన వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
పులివెందుల : అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కల్లూరు గ్రామం వద్ద సోమవారం పులివెందుల బ్రాంచి కెనాల్(పీబీసీ) కు గండి కొట్టిన వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే యామినీబాల ఆధ్వర్యంలో సోమవారం దౌర్జన్యంగా పీబీసీకి గండికొట్టి నీటిని చిత్రావతి నదికి మళ్లించారు. దీంతో వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో రైతులు మంగళవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. కాలువ గండి పూడ్చే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకుని దురుసు గా ప్రవర్తించారు. దీంతో వైఎస్ వివేకా కెనాల్ వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.