అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి | Hijra died in Suspicious status | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి

Published Sun, Mar 15 2015 3:23 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి - Sakshi

అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి

 నరసన్నపేట : మండలంలోని రావులవలసలో హిజ్రా (వర్ధిని) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలి మృతి చెందింది. రావులవలస గ్రామ శివార్లులో ఈ సంఘటన జరిగింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలంలో రాత్రి 10 గంటల వరకూ హిజ్రా శరీరం కాలుతూ ఉంది. రాత్రి 8 గంటల సమయంలో  నరసన్నపేట నుంచి స్కూటీపై వచ్చిన హిజ్రా ఒక్కసారి ఈ విధంగా మంటల్లో కాలి మృతి చెందడం గ్రామంలో సంచలనం రేపింది. అయితే గ్రామస్తులు మాత్రం ఈ సంఘటనపై ఏమీ చెప్పలేకపోతున్నారు.  కాగా హిజ్రా నరసన్నపేటలోని నక్కవీధిలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలు వినియోగించే స్కూటీ సంఘటనకు సమీపంలో పార్కు చేసి ఉంది. దానికి ఆమె చున్నీ ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement