‘విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’ | http://www.sakshi.com/news/andhra-pradesh/how-to-manage-seemandhra-people-on-state-bifurcation-54512 | Sakshi
Sakshi News home page

‘విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’

Published Mon, Aug 5 2013 2:43 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

http://www.sakshi.com/news/andhra-pradesh/how-to-manage-seemandhra-people-on-state-bifurcation-54512

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు వెనక్కు తీసుకోవాలని విశాలాంధ్ర మహాసభ డిమాండ్ చేసింది. ఆదివారం ట్యాంక్‌బండ్ పోతన విగ్రహం వద్ద విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు నిరసన చేపట్టారు. విశాలాంధ్ర మహాసభ నాయకుడు పరకాల ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి పాల్గొన్నారు. అయితే నిరసన చేపట్టేందుకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా, విశాలాంధ్ర నాయకుల నిరసన కార్యక్రమంలో ఓ యువకుడు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశాడు. కవాడిగూడ గాంధీనగర్‌కు చెందిన ఆ యువకుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తారా అంటూ విశాలాంధ్ర నాయకులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement