వైఎస్సార్ జిల్లా: ఏపీలో ఇసుక మాఫియాకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఇసుక అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లాలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఇసుక డంపులను అధికారులు సీజ్ చేశారు.
చిన్నమండెం మండలం రెడ్డివారిపల్లె గ్రామ సమీపంలో అక్రమంగా ఇసుకను నిలువ చేస్తున్నారనే పక్కా సమాచారంతో రెవెన్యూ అధికారులు దాడులకు దిగారు. 120 ట్రాక్టర్ల ఇసుక డంపులను అధికారులు సీజ్ చేశారు. డంప్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.