వైఎస్సార్ జిల్లా (రైల్వే కోడూరు) : అక్రమంగా నిల్వ ఉంచిన 22 ఎర్ర చందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం అర్ధరాత్రి అటవీ అధికారులు రైల్వే కోడూరు మండలంలోని గుండాల ఏరు వద్ద సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓ చోట నిల్వ ఉంచిన 24 దుంగలను సీజ్ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ అరెస్టు కాలేదు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.