కడప: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బాలుపల్లి చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా రూ.6 లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. దాంతో వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యాడు. వాహనంతోపాటు ఎర్రచందనాన్ని సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం యజమాని కోసం పోలీసులు ఆర్టీఏ అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.