దామరగిద్ద, న్యూస్‌లైన్: భర్త పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తా నూ తాగింది. పరిస్థితి విషమించడంతో తల్లి,కొడుకు మృ త్యువాతపడ్డాడు. ఈ హృదయవిదాకర సంఘటన ఆదివారం మండలంలోని వత్తుగుండ్ల గ్రా మంలో చోటుచేసుకుంది. పోలీ సులు, స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన పందు ల కాశప్ప, గోవిందమ్మ(30) భార్యాభర్తలు.
వారికి ఇద్దరు కొడుకులు లక్ష్మణ్(5), వెంకటే ష్(9) ఉన్నారు. అయితే కాశ ప్ప ఏడాది క్రితం రెండో పెళ్లి చేసుకుని మహారాష్ట్రకు వలసవెళ్లాడు. దీంతో తన ఇద్దరుపిల్లలతో కలిసి గోవిందమ్మ స్వగ్రామంలో కాయకష్టం చేసుకుని జీవనం సాగిస్తోంది. అయితే రెండో వివాహం చేసుకున్న భ ర్త తనను తన పిల్లలను పట్టిం చుకునేవాడు కాదని వాపోయే ది. ఇటీవల మొహర్రం పండుగకు ఇంటికి వచ్చిన భర్త తన బాగోగులు చూడకుండా తిట్టిపోశాడని విలపించిందని గ్రా మస్తులు కొందరు తెలిపారు.
ఈ క్రమంలో ఆమె క్యాతన్‌పల్లిలోని తన పుట్టింటికి రాగా, ఎందుకు వెళ్లావంటూ భర్త కా శప్ప రెండుక్రితం ఫోన్‌చేసి మందలించాడు. అతని మాట లు భరించలేక తిరిగి ఆమె వత్తుగుండ్లకు వెళ్లింది. భర్త తనను పట్టించుకోకపోవడం, పైగా తిట్టివెళ్లడంతో గోవింద మ్మ మనస్తాపానికి గురైంది. దీంతో ఆదివారం రాత్రి తన ఇద్దరు కొడుకుల చేత పురుగుమందు తాగించి..తాను కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడిం ది. ఇరుగుపొరుగు వారు ఉద యం ఇంట్లోకి వెళ్లి చూడగా గో విందమ్మ, చిన్నకొడుకు లక్ష్మణ్ అప్పడికే ప్రాణాలు విడిచారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పెద్దకొడుకు వెంకటేష్‌ను చికిత్స కోసం ‘పేట’ ఏరియా ఆస్పత్రికి తరలించా రు. అతని ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు.
భర్త వేధింపుల కా రణంగానే మనస్తాపానికి గురై తన అక్క ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరుడు అంజప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సీఐ లింగ య్య, ఎస్‌ఐ వెంకటేశ్వరావు గ్రామాన్ని సందర్శించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ‘పేట’ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
భర్త పట్టించుకోవడం లేదని..
Published Mon, Dec 2 2013 3:11 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement