అనంతపురం (కనగానపల్లి) : అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం కుర్లపల్లిలో ఓ వ్యక్తి.. భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. కుర్లపల్లి గ్రామానికి చెందిన అక్కులప్ప తన భార్య మల్లీశ్వరమ్మ(35)పై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి ఆవేశానికి లోనైన అక్కులప్ప ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్యను దారుణంగా నరికాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అనంతరం అక్కులప్ప పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను నరికి చంపిన కిరాతకుడు
Published Sun, Jul 5 2015 8:22 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement