అనంతరపురం : అనంతపురం జిల్లాలో కుటుంబకలహాలతో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడో వక్తి. ఈ సంఘటన గుడిబండ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో జరిగింది. వివరాలు.. మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన రంగనాయకులు(30) కూలీ పని చేసి జీవనం సాగిస్తున్నాడు. కాగా తొమ్మది నెలల క్రితం మమత(25) తో పెళ్లి అయింది. గత కొద్ది కాలంగా కుటుంబంలో కలహాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి భార్యను గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం తాను ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(గుడిబండ)
భార్య గొంతుకోసి భర్త ఆత్మహత్య
Published Fri, Apr 17 2015 12:06 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement