రియాద్: హైదరాబాద్‌కు చెందిన హుస్సేన్ సయీద్ అనే నర్స్‌పై సౌదీ అరేబియాలో ఆఫ్రికన్ జాతీయుడు దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో తీవ్రగాయాలతో సయీద్ ప్రాణాలు విడిచాడు. డమ్మామ్ పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ముబారకియా ప్రాంతంలోని ఓ ఇంట్లో మగ నర్స్‌గా రెండేళ్ల నుంచి సయీద్ పనిచేస్తున్నాడు. అదే ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఇథియోపియా వాసికి, సయీద్‌కు మధ్య ఘర్షణ జరిగింది. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సౌదీలో హైదరాబాదీపై ఆఫ్రికన్ దాడి; మృతి
Published Thu, Feb 20 2014 2:38 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM