
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విధానాలు నచ్చే పార్టీలో చేరుతున్నట్లు సినీ నటుడు దగ్గుబాటి రాజా రవీంద్ర తెలిపారు. వైఎస్ జగన్ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యానని, ఆయనను కలిసి పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా బుధవారం ఉదయం లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
‘ఎవరి ఒత్తిడి లేదు, అందుకే వైఎస్సార్‌సీపీలో చేరా’
ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుఫున ప్రచారం చేస్తానని జగన్‌ని కోరానని, దానికి ఆయన ఒప్పుకున్నట్లు రాజా రవీంద్ర వెల్లడించారు. వైఎస్ జగన్ విజయానికి తప్పకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అన్ని వర్గాల నుంచి ప్రముఖులు భారీగా వైఎస్సార్‌సీపీలో చేరి వైఎస్ జగన్‌కు అండగా నిలుస్తోన్న విషయం తెలిసిందే.