గుర్తింపు కార్డు పోరుుందా! అయితే పొందండి ఇలా.. | identity card! Get However, I . | Sakshi
Sakshi News home page

గుర్తింపు కార్డు పోరుుందా! అయితే పొందండి ఇలా..

Published Tue, Jan 5 2016 12:48 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

identity card! Get However, I .

ప్రయోజనం
 
ఒకప్పుడు గుర్తింపు కోసం ఒక్క రేషన్ కార్డునో, లేదా ఓటర్ గుర్తింపు కార్డునో అడిగేవారు. ఇప్పుడు అనేక రకాల గుర్తింపు కార్డులు జీవితంతో భాగమయ్యాయి. డెబిట్ కార్డు నుంచి ఆధార్ కార్డు వరకూ వెంట ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.  ఆ కార్డులుపోతే ఏం చేయూలో అర్థంగాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పొందడానికీ మార్గాలున్నారుు. అవేవో  తెలుసుకుందాం.   -గురజాల
 
ఆధార్ కార్డు
అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి అరుు్యంది. ఆధార్ కార్డు పోతే దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి మీ పూర్తి వివరాలు చెపితే ఆన్‌లైన్‌లో చూస్తారు. దీని కోసం తెల్ల రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ తీసుకెళ్లాలి. నిర్ణీత రుసుం చెల్లిస్తే డుప్లికేట్ ఆధార్ కార్డు జారీ చేస్తారు. తాజాగా ఆకర్షణీయంగా ఉండే పీవీసీ కార్డులూ ఇస్తున్నారు.
 
ఓటరు కార్డు
గుర్తింపు ధ్రువీకరణకు, ఓటు వేయడానికి ఎంతో ఉపయోగపడే  ఓటర్ కార్డు పోతే సులభంగా పొందవచ్చు. పోయిన మీ కార్డులోని వివరాలతో మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆ వివరాలతో సరిపోల్చి మీ కార్డు నెంబర్ చూపుతారు. అవన్నీ సరైనవైతే అక్కడికక్కడే డూప్లికేట్ కార్డు జారీ చేస్తారు. దీని కోసం నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల ఆకర్షణీయంగా ఉండే పి.వి.సి ఓటరు కార్డులు కూడా జారీ చేస్తున్నారు.
 
పాన్ కార్డు
ప్రతి ఉద్యోగి, లేదా ఆదాయ మార్గాలున్న వారందరికీ ఇప్పుడు పాన్‌కార్డు తప్పనిసరి. ఈ పాన్ కార్డు పోతే దానికి సంబంధించిన సంఖ్య ఉంటే దగ్గరలోని టిన్ ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లి డూప్లికేట్ కోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డు సంఖ్య గుర్తులేనప్పుడు గతంలో మీరు ఇచ్చిన వివరాలన్నీ పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకుంటే సంబంధిత శాఖ నుంచి మీ ఫోన్ నంబర్‌కు సమాచారం వస్తుంది. మీ వివరాలతో సరిపోల్చి ఇప్పటికే మీ పేరిట జారీ అయిన పాన్ సంఖ్య తెలుస్తుంది. వివరాలకు సంక్షిప్త సందేశంలో ఇచ్చిన టోల్ ఫ్రీ సంఖ్యకు ఫోన్ చేసి పాన్ సంఖ్యను తెలుసుకుని డూప్లికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
 
డెబిట్..క్రెడిట్ కార్డు
నగదు సంబంధిత డెబిట్, క్రెడిట్ కార్డులు వ్యక్తి జీవితంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కార్డులు పోతే తక్షణం సంబంధిత బ్యాంకుకు సమాచారం అందించాలి. బ్యాంకు మూసివుంటే సంబంధిత బ్యాంకు ప్రధాన కార్యాలయానికి లేదా కార్డుల సేవలందిస్తున్న విభాగానికి సమాచారం అందించాలి. దీంతో కార్డుల ద్వారా జరిగే లావాదేవీలను వారు నిలువరించడం జరుగుతుంది. మరుసటి రోజు బ్యాంకుకు వెళ్లి మరొక కార్డు కోసం దర ఖాస్తు చేసుకుంటే కొన్ని జాతీయ బ్యాంకులు వెంటనే, మరికొన్ని బ్యాంకుల్లో కొంత సమయం తర్వాత జారీ చేస్తున్నారు.
 
రేషన్ కార్డు
సాధారణంగా రేషన్‌కార్డు పోతే దాని సంఖ్య ఆధారంగా డూప్లికేట్ జారీ చేస్తారు. ఈ సంఖ్య తెలియకపోతే సంబంధిత డీలర్ వద్దకు వెళ్లి వారి వద్ద ఉన్న డైనమిక్ కీ రిజిష్టర్‌లో వివరాలు తీసుకుని మీ సేవ ద్వారా డూప్లికేట్ రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పట్టణాల్లో అరుుతే సహాయ పౌర సరఫరాల అధికారి, గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్లు డూప్లికేట్ కార్డు జారీ చేస్తారు. వాటిని మళ్లీ మీ సేవ ద్వారా పొందవచ్చు.
 
డ్రైవింగ్ లెసైన్సు  ఆర్‌సీ(రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్)
 వాహనానికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానాలు పడతాయి. దీంతో పాటు పోలీసులకు వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఉంటుంది. ఆర్‌సీ పోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం చేయకుండా ముందుగా ఆర్‌సీ పోయినట్లు మీ సేవ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. తర్వాత దానికి సంబంధించిన రసీదును తీసుకెళ్లి సంబంధిత ఆర్టీవో కార్యాలయంలో డూప్లికేట్ ఆర్‌సీ కోసం దరఖాస్తు చేసి, నిర్ణీత రుసుం చెల్లించాలి. ఆ తర్వాత పోలీసుల నుంచి అభ్యంతరం లేనట్లు పత్రం తీసుకుని వచ్చాక డూప్లికేట్ ఆర్‌సీ మంజూరు చేస్తారు.
 
రైల్వే రిజర్వేషన్ టికెట్
దూర ప్రయాణాల కోసం ముందస్తు రైల్వే రిజర్వేషన్ టికెట్ కోనుగోలు చేసి, తీరా ప్రయాణ సమయం మరచిపోవడం, పోగొట్టుకోవడం చేస్తారు. అటువంటి వారు డూప్లికేట్ టికెట్ పొందే అవకాశం ఉంది. చార్ట్ తయారీకి ముందే గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించి వివరాలు తెలిపితే డూప్లికేట్ టికెట్‌ను నిర్ణీత రుసుం వసూలు చేసి జారీ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement