సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో రిజిస్ట్రేషన్లకు ఆధార్ లింకేజీని డిసెంబర్ 1నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో దస్తావేజుదారులు అంగీకరిస్తే తంబ్ ఆధారంగా పూర్తి వివరాలు సేకరించాలని యోచిస్తోంది. దీనితో బోగస్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది. పౌరులందరికి ఆధార్ అందుబాటులోకి రావడంతో పలు కీలక వ్యవహారాల్లో వ్యక్తిగత గుర్తింపునకు ఆధార్ ప్రధాన సాక్షిగా మారింది.
ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ దస్తావేజుల నమోదు ప్రక్రియ సమయంలో క్రయ, విక్రేతలతోపాటు సాక్షుల గుర్తింపునకు ఆరు రకాల ఫొటోలను కూడిన సాక్ష్యాలలో ఏదో ఒక దానిని అడుగుతోంది. ఇందులో ఆధార్ తప్పని సరిగా మారింది. ఓటరు కార్డు, పాన్‌కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్టు, తదితర కార్డులలో ఏదో ఒక దాని నకలు సబ్ రిజిస్ట్రార్లు తీసుకుని దస్తావేజులను నమోదు చేస్తారు. అయితే ప్రస్తుతం ఆధార్ మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఒరిజినల్ స్కాన్ చేసి తిరిగి ఇచ్చేస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో తంబ్ తీసుకుంటనే ఆధార్ నంబర్ ఆధారంగా పూర్తి స్థాయి వివరాలతోపాటు బోగస్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయవచ్చని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ భావిస్తోంది.
స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ లింక్!
Published Mon, Nov 9 2015 12:30 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement