న్యూఢిల్లీ: ఆధార్ కార్డు లేకపోయినా, రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోయినా, బయోమెట్రిక్ ధ్రువీకరణ పనిచేయకపోయినా లబ్ధిదారులకు రేషన్ సరుకులను అందజేయాల్సిందేనని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ ఉత్తర్వులను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేవలం ఆధార్ లేదన్న కారణంతో అర్హులైన లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేయరాదని తెలిపింది. లబ్ధిదారుడు అర్హుడు కాదని నిర్ధారించుకున్నాకే కార్డును రద్దు చేయాలని సూచించింది. ఓటర్ కార్డు, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ స్లిప్, రేషన్ కార్డు తదితర పత్రాలను సమర్పించిన వారికి సరుకులు అందజేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలా ఆధార్ లేని అర్హులైన లబ్ధిదారుల కోసం డీలర్లు ప్రత్యేక పుస్తకాన్ని నిర్వహించాలంది.
Comments
Please login to add a commentAdd a comment