బోగస్ ‘ఆధార్’తో రేషన్ బాగోతం
కొత్త కార్డుల కోసం అప్‌లోడ్ కాని వివరాలు
దరఖాస్తు చేసే అవకాశం కోల్పోతున్న బాధితులు
జనగామ బానేష్... ఎల్‌ఐసీ ఏజెంట్ వద్ద గుమస్తా.. భార్య. కుమారుడు ఉన్నారు. పదిహేనేళ్లుగా పీఎం పాలెంలో నివాసం ఉంటున్న బానేష్ రేషన్ కార్డు కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. తాజాగా కొత్త రేషన్ కార్డులిస్తున్నారని తెలియడంతో దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రానికి వెళ్లారు. కానీ తన ఆధార్ నంబర్‌తో వేరెవరికో ఎప్పుడో రేషన్ కార్డు మంజూరైందని తెలిసి అవాక్కయ్యారు. గతంలో జారీ అయిన కార్డు రద్దు చేస్తే గానీ కొత్త కార్డు ఇవ్వమని అధికారులు చెప్పారు. - సాక్షి, విశాఖపట్నంట
ఇది ఒక్క బానేష్ సమస్యే కాదు... జిల్లావ్యాప్తంగా బోగస్ సీడింగ్‌తో ఎన్నో కార్డులు జారీ చేసేశారు. దీంతో ఎంతోమంది అర్హులు కార్డులకు నోచుకోలేక అవస్థలు పడుతున్నారు. జనగామ బానేష్ ఆధార్ నంబర్(28959545 1568)తో మధురవాడకు చెందిన కుడుపూరి రాముకు చెందిన రేషన్ కార్డు(ఆర్‌ఎపీ 038440485 709)తో సీడింగ్ అయింది. ఈ కార్డుకు జీవీఎంసీ 7వ వార్డులోని సర్కిల్ నెం-2 పరిధిలోని అల్లెన శ్రీదేవి పేరిట ఉన్న షాప్ నెం: 0387 404లో రేషన్ సరుకులిస్తున్నారు.‘నీ ఆధార్ నెంబర్‌తో ఇక కొత్తరేషన్ కార్డు జారీ కాదని’ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో తన ఆధార్ నెంబర్‌తో సీడింగ్ అయిన రేషన్ కార్డుదారుని వివరాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్ పరిశీలించగా సదరు కార్డులోని ఇతర సభ్యులకు కూడా ఇదే రీతిలో తప్పుడు ఆధార్ నెంబర్లతో సీడింగ్‌అయినట్టుగా గుర్తించారు. రాముకు బానేష్ ఆధార్ నెంబర్‌తో సీడింగ్ కాగా, అతని భార్య సత్యవతికి గుజ్జల రాజులమ్మకు ఆధార్ సీడింగ్ జరగనే లేదు. కుమారులు కౌషిక్‌కు గొల్ల కోదండ రామనందబాబు ఆధార్ నెం:329997677245, దీక్షిక్‌కు అయినాల జ్ఞానాశ్వర రావు ఆధార్ నెం:49793513369, దిలీప్‌కు పెరుమాళ్ల సీతారాం ఆధార్ నెం:571009069324తోనూ సీడింగ్ అయింది. మరో విస్తుగొలిపే విషయమేమిటంటే దీక్షిక్‌తో సీడింగ్ అయిన అయినాల జ్ఞానేశ్వరరావు ఆధార్ నెంబరుతో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 25 మంది కార్డుదారులతో సీడింగైనట్టుగా వెలుగుచూసింది. ఇలా మిగిలిన వారి ఆధార్ నెంబరుతో కూడా పాతిక నుంచి 30 వరకు కార్డుదారులతో సీడింగ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ షాప్ నెంబర్ 0387404 పరిధిలోనే జరగడం గమనార్హం.
ఇలా ఈ ఒక్క షాపు పరిధిలోనే ఇన్ని బోగస్ కార్డులుంటే.. మిగిలిన షాపుల పరిధిలో ఏ స్థాయిలో ఉంటాయో అర్ధమవుతుంది. ఈ తంతు అంతా డీలర్, సివిల్ సప్లయిస్ అధికారుల కుమ్మక్కు వల్లే జరిగిందని స్పష్టమవుతోంది. ఒకరి ఆధార్ నెంబర్లను మనుగడలో లేని రేషన్ కార్డులతో సీడింగ్ చేయించి వినియోగంలోకి తీసుకురావడం ఒక ఎత్తయితే.. ఇలా సీడింగ్ అవడం వలన సదరు ఆధార్ నెంబర్ కలిగిన వ్యక్తులు కొత్తగా రేషన్ కార్డు పొందే అవకాశం కోల్పోయే పరిస్థితి నెలకొంది. బానేష్‌కు ఇదే విధంగా కొత్తకార్డుకు దరఖాస్తుచేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇలా తప్పుడు నెంబరుతో సీడింగ్ అయిన రేషన్‌కార్డు రద్దవడం లేదా సీడింగ్ అయిన నెంబరును తొలగించి అసలు కార్డుదారుని ఆధార్ నెంబరుతో సీడింగ్ చేస్తే తప్ప బానేష్ కొత్తకార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. ఇలా జిల్లావ్యాప్తంగా వేలాదిమంది ఆధార్ నెంబరుతో అప్‌లోడ్ కాక కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి ఈ బోగస్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.
15విఎస్‌సీ111ః- బానేష్ ఆధార్ కార్డు
15విఎస్‌సీ112ః- బానేష్ ఆదార్ నెం:తో సీడింగ్ అయిన కె.రాము రేషన్ కార్డు ఇదే.
15విఎస్‌సీ113ః-కె.రాము కుమారుడి దీక్షిక్‌తో సీడింగ్ అయినఅయినాల జ్ఞానేశ్వరరావుకు చెందిన ఆధార్ నెంబర్‌తో సీడింగ్ కార్డుదారుల జాబితా
ఒకే నంబర్ ఎంతోమందికి ఆధార్‌ం
Published Tue, Dec 15 2015 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 2:03 PM
Advertisement
Advertisement