‘ఆధార్’ ఇవ్వకపోతే రేషన్ కట్
బెంగళూరు:ఆధార్ సంఖ్యను రేషన్ కార్డుతో అనుసంధానం చేసేందుకు ఈనెలాఖరుతో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 31నాటికి లబ్ధిదారులు రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయించాలి. లేకపోతే రేషన్ కట్ చేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆధార్‌నునేరుగా రేషన్ షాపులో అందజేయాలని సూచించింది.
ఇక ఈ ఏడాది జూన్ నుంచి బీపీఎల్ రేషన్‌కార్డు దారులకు నెలకు ఐదు కేజీల ఆహార ధాన్యాలను(ఒక్కో వ్యక్తికి) అందజేయనున్నట్లు పేర్కొంది. ఇందులో ఉత్తర కర్ణాటక వాసులకు మూడు కేజీల బియ్యం, రెండు కేజీల గోధుమలు లేదా జొన్నలను అందజేయనున్నారు. దక్షిణ కర్ణాటక వాసులకు మూడు కేజీల బియ్యం, రెండు కేజీల రాగులను అందించేందుకు నిర్ణయించినట్లు ఆ శాఖ వెల్లడించింది.