ఒంగోలు టూటౌన్ : రైతులు విత్తనాల కోసం ప్రైవేట్ కంపెనీలను ఆశ్రయించడం.. అవి సరిగ్గా మొలకెత్తకపోవడం.. ఒకవేళ మొలకెత్తినా దిగుబడి లేకపోవడం వెరసి అన్నదాత తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈ నేపథ్యంలో రైతులే నాణ్యమైన విత్తనాలు తయారు చేసుకుంటే ఆశించిన దిగుబడి దక్కుతుందని వ్యవసాయశాఖ జిల్లా సంచాలకుడు జే ముర ళీకృష్ణ పేర్కొన్నారు.
మేలైన విత్తనం వాడితే..
జన్యు, స్వచ్ఛత, అధిక మొలక శాతం కలిగి ఉండటంతో పాటు అధిక దిగుబడిని ఇవ్వగలిగే శక్తి ఉండాలి.
మేలైన విత్తనం వాడితే 20 శాతం నుంచి 25 శాతం అధిక దిగుబడిని పొందే అవకాశముంటుంది.
విత్తనాల్లో రకాలు
విత్తనాల్లో సూటి, హైబ్రిడ్ రకాలు ఉంటాయి. సూటి రకాలంటే రైతులు ఏటా తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తర్వాత పంటగా వేసుకోవచ్చు. ఈ పద్ధతిలో రైతులు తమ విత్తనాలను ప్రతి మూడు, నాలుగేళ్లకోమారు మార్చుకోవాల్సి ఉంటుంది. విత్తనాలను మార్చే సమయంలో ధ్రువీకరించిన విత్తనాలు ఎంచుకోవాలి.
హైబ్రిడ్ రకాలంటే ఏటా ఆడ, మగ రకాలను సంకరపరిచి తయారు చేసిన విత్తనాలు. ప్రతి పంట కాలానికి కొత్త విత్తనం వాడాల్సి ఉంటుంది. పాత విత్తనాలు అంతగా పనికిరావు. దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
విత్తనం తయారీ ఇలా..
స్వపరాగ సంపర్కం జరిగే పంటలో రైతులు ఎవరి విత్తనాన్ని వారు తయారు చేసుకుంటే విత్తనంపై పెట్టుబడి తగ్గడంతో పాటు మేలు రకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
విత్తనోత్పత్తి చేసే పొలం సారవంతమైనదై ఉండాలి. మురుగు నీరు నిల్వ ఉండకూడదు.
విత్తనం కోసం పండించే పొలానికి అదే పంటకు చెందిన ఇతర రకాలు సాగవుతున్న పొలానికి మధ్య కనీస దూరం ఉండాలి.
విత్తనోత్పత్తి చేయదలచిన పొలానికి నీరు పెడితే అంతకు ముందు పండించిన పంట రకం మొలకెత్తుతుంది. వాటిని గొర్రు, గుంటకతో నాశనం చేయాలి. పొలంలో బెరుకులు లేకుండా చూసుకోవాలి. మొక్క ఎదిగేటప్పుడు పూత, గింజ గట్టిపడే దశలో ఏరిపాయాలి.
ఎత్తులో తేడాలున్నా ఆకుల రంగు, ఆకారం, అమరిక సరిగా లేకున్నా వెంటనే గుర్తించి తొలగించాలి. ఏ విత్తనమైనా నారు పోసే ముందు విత్తన శుద్ధి తప్పని సరి.
రైతులు తమ పంట నుంచి గానీ లేదా బాగా పండించిన ఇతర రైతుల నుంచి గానీ విత్తనాలు సేకరించి నిల్వ చేసుకోవాలి.
విత్తనం మనదైతే.. ఆ దిగుబడే వేరబ్బా!
Published Wed, Nov 12 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement