ఏలూరు : మహిళలను హింసించిన, దాడు లు చేసినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలలో కొన్ని..
తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన చిట్టూరి పూజిత కుటుంబ సభ్యులతో వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆచంట మండలం కోడేరులో తన అక్కను ఆమె భర్త, అత్తమామలు విషం పెట్టి హతమార్చారని ఆరోపించారు. తమకు న్యాయం చేయూలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశించారు.
భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో అక్రమంగా తవ్వుతున్న చేపల చెరువుల వల్ల సమీపంలోని పంట భూము లు కలుషితమవుతున్నాయని పెన్మెత్స కాళిమాత అనే మహిళ ఫిర్యాదు చేశారు. ఈ చెరువును రెండు రోజుల్లో ధ్వంసం చేయాలని తహసిల్దార్‌కు కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలంలో ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా చెలరేగి పంచాయతీ సమావేశాలను సకాలంలో నిర్వహించడం లేదని మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు పాకలపాటి తాగ్య భీమేశ్వరరావు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఉండ్రాజవరం మండలం చివటం బైపాస్ రోడ్డు పక్కనున్న సౌమ్య రెసిడెన్సీలో ఖాళీ స్థలాన్ని పూడ్చి మద్యం దుకాణాన్ని బార్‌ను తలపించేలా నిర్మించారని, దీంతో తాము ఇబ్బంది పడుతున్నామని స్థానికులు డి.పుల్లేశ్వరరావు, సీహెచ్ దుర్గాపావని, విజయలక్ష్మి తదితరులు 50 మందికిపైగా సంతకాలు చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జాయింట్ కలెక్టర్లు పి.కోటేశ్వరరావు, ఎండీ షరీఫ్, డీఆ ర్వో కె.ప్రభాకరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మహిళలపై దాడులను ఉపేక్షించం
Published Tue, Jul 7 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM
Advertisement
Advertisement