Attacks against women
-
ఏపీలో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు.. యువతి మృతి, మరొకరికి గాయాలు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రేమ పేరుతో కొందరు ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తమను ప్రేమించలేదనే కారణంగా యువతులపై దాడులకు తెగబడుతున్నారు. ఏపీలో ఒకేరోజు రెండు చోట్ల దాడి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని నల్లజర్ల గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గుర్రాల రాజు(23) అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురిచేశారు. కొద్దిరోజులుగా ఆమె వెంట పడుతూ తనను ప్రేమించాలని వేధించాడు. ఈ క్రమంలో బాధితురాలు పట్టించుకోకపోవడంతో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆమెపై దాడి చేసేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. యువతిపై దాడి చేసే సమయంలో ఆమె తల్లి అడ్డురావడంతో కోపంతో.. ఆమెపై దాడి చేశాడు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. కాగా, దాడి చేసిన తర్వాత రాజు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అలాగే, నిందితుడు రాజు కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.ఇక, నంద్యాల జిల్లాలో కూడా ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను ప్రేమించలేదనే కారణంగా యువతిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని తాను ప్రేమిస్తున్నానంటూ రాఘవేంద్ర వేధింపులకు గురిచేశాడు . అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో.. లహరిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. -
మహిళలపై దాడులను ఉపేక్షించం
ఏలూరు : మహిళలను హింసించిన, దాడు లు చేసినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలలో కొన్ని.. తూర్పుగోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన చిట్టూరి పూజిత కుటుంబ సభ్యులతో వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆచంట మండలం కోడేరులో తన అక్కను ఆమె భర్త, అత్తమామలు విషం పెట్టి హతమార్చారని ఆరోపించారు. తమకు న్యాయం చేయూలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశించారు. భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో అక్రమంగా తవ్వుతున్న చేపల చెరువుల వల్ల సమీపంలోని పంట భూము లు కలుషితమవుతున్నాయని పెన్మెత్స కాళిమాత అనే మహిళ ఫిర్యాదు చేశారు. ఈ చెరువును రెండు రోజుల్లో ధ్వంసం చేయాలని తహసిల్దార్‌కు కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలంలో ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా చెలరేగి పంచాయతీ సమావేశాలను సకాలంలో నిర్వహించడం లేదని మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు పాకలపాటి తాగ్య భీమేశ్వరరావు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఉండ్రాజవరం మండలం చివటం బైపాస్ రోడ్డు పక్కనున్న సౌమ్య రెసిడెన్సీలో ఖాళీ స్థలాన్ని పూడ్చి మద్యం దుకాణాన్ని బార్‌ను తలపించేలా నిర్మించారని, దీంతో తాము ఇబ్బంది పడుతున్నామని స్థానికులు డి.పుల్లేశ్వరరావు, సీహెచ్ దుర్గాపావని, విజయలక్ష్మి తదితరులు 50 మందికిపైగా సంతకాలు చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జాయింట్ కలెక్టర్లు పి.కోటేశ్వరరావు, ఎండీ షరీఫ్, డీఆ ర్వో కె.ప్రభాకరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.