పాలమూరు, న్యూస్‌లైన్: ఇకనుంచి పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. పె రుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్(ఎన్‌యూహెచ్‌ఎం) కార్యక్రమాన్ని అ మలుచేయనుంది. ఈ పథకం 50వేల జనాభా దాటిన పట్టణాలు, నగర పం చాయతీల్లో అమలుకానుంది. ఇందుకోసం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యం లో జనాభాతో పాటు ప్రస్తు తం ఆరోగ్యకేంద్రాల్లో వసతుల వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లాకేంద్రమైన పాలమూ రు పట్టణ జనాభా 2011 లెక్కల ప్ర కారం విలీనగ్రామాలతో కలిపి 3.20 ల క్షలు ఉంది. పెరుగుతున్న జనాభాతో పాటు పారిశుధ్యం లోపించడంతో మ లేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ, క్ష య వంటి వ్యాధులు వ్యాప్తిచెందుతున్నాయి. ఆ దిశగా పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులకు చికిత్సలు అందజేయడంతో పా టు మాతాశిశు మరణాలను తగ్గిం చేందుకు ప్రత్యేకచర్యలు తీసుకోన్నారు.
కొనసాగుతున్న సర్వే
జిల్లాలోని పట్టణాలు, నగర పంచాయతీల జనాభా, డ్రైనేజీ సౌకర్యాలు, ప్ర స్తుతం ఉన్న వైద్యసదుపాయాలు, ము రికివాడల సంఖ్య తదితర అంశాలపై వివరాలు పంపాలని జిల్లా వైద్యారోగ్య శాఖకు గతంలో ఆదేశాలు అందాయి. జిల్లాలో మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, జడ్చర్ల, షాద్‌నగర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అ యిజ, అచ్చంపేట, కల్వకుర్తి మునిసిపాలిటీల పరిధిలో వైద్య,ఆరోగ్యశాఖ, పట్టణ అధికారులు సర్వే చేపట్టారు.
జి ల్లాలో 85 ప్రాథమిక, 19 సామాజిక, 6 ప్రాంతీయ ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు అనుసంధానంగా 674 ఉప కేంద్రాలు ఉన్నా యి. జిల్లాలో 11 వరకు పట్టణ ఆరోగ్యకేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి ఉంది. ఇందులో చాలావరకు ఎన్‌హెచ్ ఆర్‌ఎం పరిధిలోనే ఉన్నాయి. సరైన సౌకర్యాలు లేక పట్టణ ఆరోగ్యకేంద్రాల పరిస్థితి ద యనీయంగా మారింది. వీటి పనితీరు ను మరింత మెరుగు పరిచేందుకు జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యం!
Published Wed, Sep 18 2013 2:58 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement