గుత్తిరూరల్, న్యూస్‌లైన్ : కె.ఊబిచెర్లలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి 200 మంది ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి సమక్షంలో నాయకులు నాగేశ్వరరావు యాదవ్, రంగారెడ్డి, వెంకటార్జున, రామచంద్ర ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన గోవిందు, ప్రసాద్, వెంకటేష్, లింగేశ్వరయ్య, నాగార్జున, సురేష్, నాగిరెడ్డి, నారాయణ, మద్దిలేటి, కంబగిరి, రామకృష్ణ, శ్రీనివాసులాచారి, ఓబులేసు, చలపతి, శ్రీనివాసులు, రాముడు, మధు, రామచంద్ర, చిన్న మద్దిలేటి, మద్దిలేటి, వేమయ్య, చిన్నగోవిందు, రామకృష్ణ, రామాంజ నేయులు, రాజశేఖర్, చిన్నసురేష్, రాజు, లక్ష్మి, ఆదెమ్మ, వన్నమ్మ, సావిత్రి, సంజమ్మ, రమణమ్మ, వెంకటేశ్వరమ్మ, నాగలీల, పెద్దక్క, సుజాతమ్మ, లక్ష్మిదేవి, బొజ్జక్క తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తెచ్చిన కేకును వై.వెంకటరామిరెడ్డి కట్ చేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
హిందూపురం మండలం సంతేబిదనూరు పంచాయతీ హనుమేపల్లికి చెందిన కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు వంద మంది ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త ఎం.హెచ్. ఇనాయతుల్లా కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
- న్యూస్‌లైన్, హిందూపురం అర్బన్
వైఎస్సార్‌సీపీలోకి 200 మంది చేరిక
Published Mon, Oct 14 2013 1:41 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement