వికలాంగులకు రూ 1500 పింఛన్ ఇవ్వాలి | Increase 1500 Pension for physical handicaps | Sakshi
Sakshi News home page

వికలాంగులకు రూ 1500 పింఛన్ ఇవ్వాలి

Published Mon, Oct 28 2013 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

Increase 1500 Pension for physical handicaps

సూర్యాపేట టౌన్, న్యూస్‌లైన్ : వికలాంగుల పింఛన్‌ను రూ 1500కు పెంచాలని తెలంగాణ వికలాంగుల,వితుంతు, వృద్ధుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముత్తినేని వీరయ్యవర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. వృద్ధులు, వితంతువులకు రావాల్సిన ప్రభుత్వ పథకాల సాధన కోసం సంఘం పోరాడుతుందని చెప్పారు. ప్రభు త్వ ఉద్యోగాలలో వికలాంగులకు దక్కాల్సిన 3శాతం రిజర్వేషన్‌ను సక్రమంగా అమలు చేయాలన్నారు. అదే విధంగా ప్రయాణ రాయితీలో వికలాంగులకు పూర్తి సౌకర్యం, వృద్ధులు, వితంతువులకు 50శాతం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మట్టపల్లి సుమలత, నాయకులు మిద్దె సైదులు, గంజికుంట్ల యాదగిరి, పతాని ప్రభాకర్, మల్లయ్య, యాదగిరి, నాగవెల్లి కరుణాకర్, భూక్య సైదా, బానోతు వేణు, రాము, లునావత్ మహేష్, ఉపేందర్, రామినేని సైదులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement