స్వైన్ ఫ్లూ పంజా | increase in swinflu | Sakshi
Sakshi News home page

స్వైన్ ఫ్లూ పంజా

Published Wed, Feb 4 2015 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

స్వైన్ ఫ్లూ పంజా

స్వైన్ ఫ్లూ పంజా

ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదు
ఇద్దరి మరణం, ఇద్దరికి చెన్నైలో చికిత్స తిరుపతిలో టెన్షన్
నివారణ చర్యలు తీసుకోని ప్రభుత్వం
ఆందోళనలో ప్రయాణికులు రుయాలో నామమాత్రపు ఏర్పాట్లు

 
తిరుపతి: జిల్లా లో స్వైన్ ఫ్లూ పంజా విసిరిం ది. పుంగనూరుకు చెందిన ఉపాధ్యాయుడు కోటస్వామిరాజు(48)ను పొట్టన పెట్టుకుంది. మరో ఇద్దరు చెన్నైలో చికిత్స పొందుతున్నారు. గత నవంబర్‌లో జిల్లాకు చెందిన వ్యక్తి స్వైన్ ఫ్లూ బారినపడి రా యవేలూరులో మరణించిన విషయం విధి తమే. తిరుపతి  ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో వేల సంఖ్యలో భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వైన్‌ఫ్లూ వేగంగా విస్తరించే అవకాశం ఉంది. దీనికితోడు శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ప్రాంతాల్లో వ్యాధి ప్రబలే అవకాశం ఉంది.

చర్యలు శూన్యం..

స్వైన్ ఫ్ల్లూ ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. వైద్య ఆరోగ్యశాఖ కేవలం నామ మాత్రపు చర్యలతో సరిపెడుతోంది. ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు వ్యాధి నివారణ చర్యల్లో  చేపట్టడంలో ఆరోగ్య శాఖ డొల్లతనం బయటపడుతోంది. జిల్లాలో ఎన్-95 మాస్క్‌ల కొరత నెలకొంది. దీంతో వ్యాధి సోకిన రోగి వద్దకు వైద్య సిబ్బంది ధైర్యంగా వెళ్లి చికిత్స అందించలేక పోతున్నారు.  రుయాలో ప్రత్యేక వార్డు ఏర్పా టు చేసినప్పటికీ అక్కడ ఎన్-95 మాస్క్‌లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వార్డులో కేవలం ఇద్దరు నర్సులకు మాత్రమే ఇలాంటి మాస్క్‌లు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలే పేర్కొం టున్నాయి. ప్రజలకు మాస్క్‌లను సరఫరా చేయకపోవడంతో నగరంలో మాస్క్‌ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రజల అవసరాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖతోపాటు టీటీడీ, కార్పొరేషన్ అధికారులు కనీస ఏర్పాట్లు కూడా చేయడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. తిరుపతికి ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వీరి ద్వారా వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. వ్యాధి నివారణకు వాడే టామిప్లూ మందులు కూడా అరకొరగా ఉండటం గమనార్హ
 
ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం..


ప్రతి గ్రామంలో స్వైన్ ప్లూకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగహన కలిగిస్తాం. అనుమానాస్పద కేసులను పరీక్షలు నిర్వహిచేందుకు వీలుగా జిల్లా రుయా, పీలేరు, మదనపల్లె ఆస్పత్రిల్లో ప్రత్యేక సెంటర్‌లు ఏర్పాటు చేశాం. రెండు రోజుల్లో అన్నీ ఏరియా ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సెంటర్‌లు నెలకొల్పుతాం.  రద్దీ ప్రదేశాల్లో అవగహన కల్పించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం.
 -శాంతికుమారి, జిల్లా వైద్యశాఖ అధికారి

పది రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే...

మంచుతో పాటు చలి ఎక్కువగా ఉండటంతో ఈ వ్యాధిపై ప్రజలు  మరో పది రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎన్-95 మాస్క్‌ల కొరత వాస్తవమే. ఆస్పత్రిలో స్వైన్ ప్లూ సోకిందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరారు. పరీక్షల అనంతరం వ్యాధి ఉన్నట్లు నిర్థారణ కాలేదు. వ్యాధి సోకిన ఇద్దరు రోగులు చెన్నైలో చికిత్స పొందుతున్నారు.
 -కయ్యల చంద్రయ్య సీఎస్‌ఆర్‌ఎంవో,
 రుయా ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement