ఆక్సిజన్ లేక శిశువు మృతి | infant died due to lack of oxygen cylinder | Sakshi
Sakshi News home page

ఆక్సిజన్ లేక శిశువు మృతి

Published Sat, Mar 21 2015 5:01 PM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందాడు.

కర్నూలు : ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...  కోస్గి మండలానికి చెందిన జయమ్మ, రామప్ప దంపతులకు ఈరోజు ఉదయం పండంటి బాబు పుట్టాడు. అయితే బాబుకు ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో చిన్నారి మృతిచెందాడు. ఈ విషయమై బాలుడి తల్లి దండ్రులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement